AMARAVATHI RASHASYAM
Date of Publish : 15/10/2026, 1:53 pm
Published by KODIREKKA RAVI

అబ్దుల్ కలాం దేశానికి స్ఫూర్తి శిఖరం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు

  • కలాం సేవలు చిరస్మరణీయమన్న సీఎం చంద్రబాబు నాయుడుఅబ్దుల్ కలాం దేశానికి స్ఫూర్తి శిఖరం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు
  • కలాం సేవలు చిరస్మరణీయమన్న సీఎం చంద్రబాబు నాయుడు
  • సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడని పవన్ కల్యాణ్ ప్రశంస
  • శాస్త్రీయ దృక్పథం, స్వయం సమృద్ధి ఆయన ఆశయాలని వెల్లడి
  • కలాం జయంతి సందర్భంగా దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించిన నేతలు

భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఘనంగా నివాళులర్పించారు. దేశాభివృద్ధికి, శాస్త్రసాంకేతిక రంగాలకు కలాం అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన జీవితం యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కలాం ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

చంద్రబాబు నాయుడు కలాంను స్ఫూర్తి శిఖరంగా అభివర్ణించారు. భారత అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త దిశానిర్దేశం చేసిన దార్శనికుడిగా ఆయనను కొనియాడారు. అరుదైన వ్యక్తిత్వం, దేశం పట్ల అంకితభావంతో కలాం అందరి హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా దేశానికి చేసిన సేవలను స్మరించుకోవాలని ‘ఎక్స్‌’ వేదికగా సందేశం ఇచ్చారు.

పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. రామేశ్వరంలోని సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం, తన ప్రతిభతో గొప్ప శాస్త్రవేత్తగా, ప్రజల రాష్ట్రపతిగా ఎదిగారని కొనియాడారు. ఎస్‌ఎల్‌వీ-3, అగ్ని, పృథ్వి క్షిపణుల రూపకల్పన, పోఖ్రాన్‌-2 అణు పరీక్షలు, టెక్నాలజీ విజన్‌ 2020లో ఆయన పాత్రను గుర్తుచేశారు. సామాన్య నేపథ్యం ఉన్నత లక్ష్యాల సాధనకు అడ్డంకి కాదని కలాం జీవితం నిరూపించిందన్నారు. శాస్త్రీయ దృక్పథం, స్వయం సమృద్ధి, నిరంతర అభ్యాసం వంటి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Rashasyam
PDF Share Save