05/11/2026, Thursday · 01:35:11 AM About UsPrivacy PolicyContact Us
Janaswaram News

విద్యుత్‌ శాఖలో ఉన్నతాధికారి సస్పెన్షన్‌.. సీఎం ఆదేశాలతో చర్యలు

Sake Naresh 15/10/2026 1:41 PM రాష్ట్ర వార్తలు 9

విద్యుత్‌ శాఖలో ఉన్నతాధికారి సస్పెన్షన్‌.. సీఎం ఆదేశాలతో చర్యలు
Want this news as a newspaper clip?Print News Clip
  • యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ స్టేజ్‌-1 చీఫ్‌ ఇంజినీర్‌ బి. సురేశ్‌ సస్పెండ్‌
  • విద్యుదుత్పత్తి పెంపులో నిర్లక్ష్యంపై టీజీ జెన్‌కో చర్యలు
  • పంట చేతికొచ్చే వరకు కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం ఆదేశం
  • విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రేవంత్‌రెడ్డి హెచ్చరిక

తెలంగాణలో విద్యుత్‌ కోతలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌) స్టేజ్‌-1 చీఫ్‌ ఇంజినీర్‌ బి. సురేశ్‌ను సస్పెండ్‌ చేసింది. టీజీ జెన్‌కో సీఎండీ ఎస్‌. హరీశ్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుదుత్పత్తి పెంపునకు అవసరమైన పనుల ప్రణాళిక, పర్యవేక్షణ, అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగనుంది.

ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ పూర్తి సామర్థ్యంతో విద్యుత్‌ ఉత్పత్తి చేయకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నైనీ, మహానది బొగ్గు బ్లాకుల నుంచి సరఫరా ఉన్నప్పటికీ ఉత్పత్తి ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్‌, తాగునీటి సరఫరా పరిస్థితులపైనా సమీక్షించారు.

వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని, పంట చేతికొచ్చే వరకు కోతలు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. రానున్న 20 రోజులు పంటలకు కీలకమని, విద్యుత్‌ కొరతతో రైతులు నష్టపోయే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి సరఫరాను మెరుగుపర్చాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్లక్ష్యాన్ని సహించబోనని, ప్రజలకు తాను జవాబుదారీగా ఉన్నానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: జిమ్ తర్వాత ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు అవసరం లేదు.. ఇవే బెస్ట్ ఫుడ్స్!

SuspensionseniorofficerpowerdepartmentMeasuresdirections

About the author

Sake Naresh

Sake Naresh

Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

37 Posts

Latest News

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు కేఫ్‌ మజాలో ధరలపై ఆరోపణలు! భూమి శిస్తుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో రైతుల్లో ఆందోళన జిమ్ తర్వాత ఖరీదైన ప్రొటీన్ పౌడర్లు అవసరం లేదు.. ఇవే బెస్ట్ ఫుడ్స్! షుగర్ ఉన్నవారు ఉపవాసం చేయొచ్చా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! చిన్నారుల్లో నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయం.. 17 కోట్ల మందికి పైగా బాధ!